Site icon HashtagU Telugu

Aishwarya Rai Bachchan : ఐశ్వర్య రాయ్ తెలుగులో డైరెక్ట్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?

Aishwarya Rai Bachchan only telugu movie with nagarjuna

Aishwarya Rai Bachchan only telugu movie with nagarjuna

ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) తన అందంతో ఇప్పటికి అందర్నీ మైమరిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు కుర్రాళ్లు ఆమెను చూసేందుకే సినిమాలకు వెళ్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఐశ్వర్య తమిళ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మోహన్ లాల్ హీరోగా మణిరత్నం(Manirathnam) డైరెక్షన్ లో ఇద్దరు సినిమాతో మొదటి సినిమా స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం కొట్టేసింది. ఆ తరువాత దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించిన ‘జీన్స్'(Jeans) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత కంప్లీట్ గా బాలీవుడ్(Bollywood) కి చెక్కేసి అక్కడే వరుస సినిమా అవకాశాలు అందుకుంది. అయితే ఐశ్వర్య తన కెరీర్ లో ఒకే ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. అది కూడా మొత్తం సినిమా అంతా కాదు. కేవలం ఒక సాంగ్ లో మాత్రమే కనిపించింది. నాగార్జున హీరోగా 1999 లో తెరకెక్కిన ‘రావోయి చందమామ’ సినిమాలోని ఒక సాంగ్ లో ఐశ్వర్య మెరిసింది. ఆ చిత్రాన్ని జయంత్‌ సి పరాన్జీ డైరెక్ట్ చేశారు. ఈ దర్శకుడు, ఐశ్వర్య ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే రావోయి చందమామ సినిమా సమయంలో ఒక హీరోయిన్ కలవడానికి జయంత్‌ ముంబై వెళ్ళాడు.

ఆ సమయంలో ఐశ్వర్యని కలిశారు. అప్పుడు ఐశ్వర్య ఇలా అంది. మీ సినిమాల్లో నటించమని మీరు ప్రతి ఒక్కర్ని అడుగుతున్నారు. నన్ను ఎందుకు అడగరు అని ప్రశ్నించదట. దీంతో జయంత్‌.. రావోయి చందమామ సినిమాలో ప్రీతిజింతాతో చేయిద్దాం అని అనుకున్న సాంగ్ ని ఐశ్వర్య రాయ్ తో చేయించారు. అలా ఐశ్వర్య ఆ ఒక్క సినిమాలో కనిపించి తెలుగు ఆడియన్స్ ని అలరించింది. మణిశర్మ ఇచ్చిన లవ్ టు లివ్ అనే ఆ క్యాచీ సాంగ్ కి నాగార్జున, ఐశ్వర్య రాయ్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు.

 

Also Read : Akkineni Nageswara Rao : దేవదాసు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తాగి నటించారా? అలా కనిపించడానికి ఏం చేశారు?