Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ సినిమా నుంచి ఐశ్వర్య ఫస్ట్ లుక్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 10:03 PM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి సూపర్ స్టార్లు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

అయితే విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉండగానే అప్పుడే చిత్రం బృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే నటీనటుల ఒక్కొక్కరి లుక్ ని డిలీట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల విక్రమ్, జయం రవి, కార్తి లుక్ ను విడుదల చేశారు. ఇక తాజాగా ఐశ్వర్య ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇక పోస్టర్ లో ఐశ్వర్యరాయ్ తన లుక్స్ తో అదరగొడుతుంది. ఇందులో ఐశ్వర్యారాయ్ పజూహూర్ రాణి నందిని పాత్రలో నటిస్తోందట. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా తమిళం, హిందీ, తెలుగు, మలయాళం,కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇది మాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉంది. అయితే దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో దాదాపుగా నాలుగేళ్ల తర్వాత సినిమా వస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఐశ్వర్య లుక్ పోస్టర్ తో అంచనాలు మరింత పెరిగాయి.