Aishwarya Rai Divorce: అభిషేక్ తో ఐష్ విడాకులు?

మిస్ వరల్డ్ 1994 టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ బయటపెడుతూ అగ్ర నటిగా ఎదిగింది.

Published By: HashtagU Telugu Desk
Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai Divorce: మిస్ వరల్డ్ 1994 టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ బయటపెడుతూ అగ్ర నటిగా ఎదిగింది. 2007లో ఐష్ అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారికి 12 ఏళ్ల కుమార్తె ఆరాధ్య కూడా ఉంది. అయితే గత కాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్ చెడిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఐశ్వర్య బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్తలు వట్టి పుకార్లుగా పరిగణించలేము. ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాయ్ ఇప్పుడు బచ్చన్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాలీవుడ్ వార్తా మీడియా సంచలన సమాచారాన్ని ప్రచురించింది. బచ్చన్ కుటుంబానికి దూరంగా ఉన్న ఐశ్వర్య తన తల్లితో ఎక్కువ సమయం గడుపుతుందని చెబుతున్నారు.పుకార్లకు స్వస్తి చెప్పే క్రమంలో కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్‌కి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఒకే కారులో వచ్చారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. మరి కూతురు కోసమే వీరిద్దరూ కలిసి వచ్చారా లేక ఇద్దరు కలిసే ఉంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Metro Train – Saree Stuck : మెట్రో రైలులో మహిళ చీర ఇరుక్కుపోయి ఏమైందంటే ?

  Last Updated: 17 Dec 2023, 02:17 PM IST