Site icon HashtagU Telugu

AI Technology : ఓర్నీ..హీరోయిన్ల ఫొటోలే కాదు వాయిస్ కూడా మార్చేశారు కదరా..!!

Ai Voice

Ai Voice

టెక్నలాజి  ( Technology)రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు..ప్రతి రోజు వందల సంఖ్యలో సరికొత్త టెక్నలాజి టూల్స్ అందుబాటులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తున్నాయి. పదిమంది చేసే పనిని పది సెకన్లలో చేసే టెక్నలాజి వచ్చి ..చాలామందికి శ్రమ లేకుండా చేస్తున్నాయి. ఈ టెక్నలాజి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో..అంతకు మించి అపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నలాజి అందుబాటులోకి వచ్చాక..నమ్మలేనివి ఎన్నో జరుగుతున్నాయి.

ఏఐ వంటి టెక్నాలజీల (AI Technology) కారణంగా సైబర్‌ నేరాలు, డేటా చౌర్యం..ఫోటో మార్ఫింగ్ , వీడియోస్ మార్ఫింగ్ ఇలా ఎన్నో చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించి ఎన్నో వీడియోస్ బయటకు వచ్చి షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో చాలా రకాల మార్ఫింగ్ వీడియోలు ఇంకా దర్శనం ఇస్తూనే ఉన్నాయి. తాజాగా ఏఐ సాయంతో హీరోయిన్ల వాయిస్ లను మిమిక్రీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri) వాయిస్ (Voice) ను.. కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కృతి సనన్ (Kiara Advani, Parineeti Chopra, Kruthi ) గొంతులుగా చేంజ్ చేసి ఆశ్చర్య పరిచారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఏఐ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Tour Tips : మహారాష్ట్రలోని ఈ నాలుగు అందమైన హిల్ స్టేషన్లు వారాంతాల్లో సరైన ప్రదేశాలు.!