Site icon HashtagU Telugu

Sammathame On OTT: ఓటీటీకి సమ్మతమే!

Sammathame

Sammathame

ఆహ, 100 % లోకల్ ఓటిటి ప్లాట్ఫామ్ ప్రతివారం ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. అందరి మనసులో అపురూపంగా నిలిచిపోయింది. మరోసారి అందరిని తన మత్తులో ముంచెత్తడానికి సమ్మతమే సినిమాతో వచ్చేస్తుంది. ఈ జులై 15 శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆహ లో సమ్మతమే సినిమా విడుదల కానుంది. కథ విషయానికి వస్తే, కృష్ణ (కిరణ్ అబ్బవరం) తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోతాడు. అప్పటి నుండి,  పెళ్లి చేసుకోవాలన్నదే కృష్ణ లక్ష్యంగా మారుతుంది. ప్రేమకు దూరంగా ఉంటూ.. పెళ్లి తరువాతే ప్రేమ అనేలా పెరుగుతాడు. అలాంటి కృష్ణ‌కు శాన్వి (చాందినీ చౌదరి) పరిచయం అవుతుంది. అసలు తాను కోరుకున్న లక్షణాలు ఒక్కటీ కూడా లేని శాన్వితో ప్రయాణం ఎలా సాగుతుంది? పెళ్లికి ముందు ప్రేమించను అని చెప్పే కృష్ణ చివరకు ప్రేమలో పడటం? చివరకు అది ఎలాంటి మలుపు తిరుగుతుంది? శాన్వి, కృష్ణల ప్రయాణం ఎలా ముగుస్తుంది? అనేదే కథ.

పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం?  తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు మరియు ఈ సినిమా రచయిత గోపినాథ్ రెడ్డి. మరి ఇలాంటి కథ ఎలా ముగుస్తుందో తెలియాంటే జులై 15 రాత్రి 12 గంటలకు సమ్మతమే సినిమాని చూడాల్సిందే.