సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రైవేట్ స్కూల్‌లో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో శంకర్ చేతులు మరియు కళ్లకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషాదకర వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తక్షణమే విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు ఆయన భార్య సురేఖ కూడా తక్షణమే సింగపూర్‌కు చేరుకున్నారు. మార్క్ శంకర్‌ను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించి, ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Aryan Khan : షారుక్ ఖాన్ వారసుడి కెరీర్ షురూ.. వెబ్ సిరీస్ వస్తోంది
ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో అనేక మంది ప్రార్థనలు చేస్తూ పోస్ట్‌లు చేస్తూ తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి విడుదలైన తాజా ఫోటోలో మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది అభిమానులకు కొంత ఊరటను కలిగించింది. పవన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు సాధారణ గదికి షిఫ్ట్ అయినట్టు తెలిపారు. అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో లేడీ అఘోరి, మార్క్ శంకర్ ఆరోగ్యం కోలుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. “పవన్ కళ్యాణ్ గారు, మీరు బాధపడకండి. మీ కుమారుడు మళ్లీ నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. నా వంతుగా నేను పూజలో కూర్చొంటున్నాను. మీరు సనాతన ధర్మం కోసం పోరాటం కొనసాగించండి” అంటూ ఆ అఘోరి హృదయపూర్వకంగా వెల్లడించాడు. ఇది చూసిన పవన్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. పాపం చిన్నారి మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తాడని అందరూ ఆశిస్తున్నారు.