Site icon HashtagU Telugu

Chiranjeevi : విశ్వంభర తర్వాత చిరు ఎవరితో అంటే..!

Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival

Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్రిష తో పాటుగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి దేవ కన్యగా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెళ్లుగా ఈషా చావ్లా, సురభి లాంటి హీరోయిన్స్ నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత చిరంజీవి హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించబోతుందని టాక్. పీపుల్ మీడియాతో పాటుగా చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమా పూర్తి అవ్వడం ఆలస్యం అలా చిరుతో సినిమా మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. చిరుతో సినిమా కోసం హరీష్ శంకర్ కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా షురూ అవుతుంది. మరి మెగా అభిమాని అయిన హరీష్ శంకర్ చిరుతో ఎలాంటి సినిమా చేస్తారన్నది చూడాలి.