Mythri Movie Makers : టాలీవుడ్ లో భారీ సినిమాలు అందిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ్ లో కూడా దూసుకెళ్తుంది. తెలుగులో శ్రీమంతుడు, రంగస్థలం, జనతా గ్యారేజ్, గ్యాంగ్ లీడర్, మత్తు వదలరా, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, అంటే సుందరానికి, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప 2.. లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించింది మైత్రి మూవీ మేకర్స్.
సినిమా నిర్మాణంతో పాటు గత రెండేళ్లుగా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. తెలుగులో మంచి సినిమాలు, వాళ్ళ సొంత సినిమాలు, వేరే భాషల సినిమాలు కూడా మైత్రి తెలుగులో రిలీజ్ చేస్తుంది. మరో పక్క బాలీవుడ్ లోకి జాట్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ సినిమా నిర్మిస్తున్నారు.
అలాగే తమిళ్ లో ఆల్రెడీ అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. తమిళ్ ఎంట్రీనే స్టార్ హీరోతో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే తమిళ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తో కూడా మరో సినిమా చేస్తున్నారు. లవ్ టుడే తో ఫేమ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఫిబ్రవరి 21 న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మైత్రి అధినేతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ.. మేము ప్రదీప్ రంగనాథన్ తో కూడా ఒక సినిమా తమిళ్ లో చేస్తున్నాము. ఆల్రెడీ ఓ 20 రోజులు షూట్ జరిగింది. కథ మాత్రం చాలా బాగుంది ఆ సినిమా అని చెప్పారు. తమిళ్ నుంచి కూడా మరిన్ని కథలు వింటున్నారు మైత్రి నిర్మాతలు. ఇలా తమిళ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ తో పటు అటు తమిళ్, ఇటు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా ఎదగాడికి ప్రయత్నిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
Also Read : Vijay Deverakonda : తన తల్లితో విజయ్ దేవరకొండ కాశీ ట్రిప్.. అల్లు అర్జున్ భార్య, ఫ్రెండ్స్ కూడా..