Site icon HashtagU Telugu

Netflix CEO Ted Sarandos: మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబు

Netflix CEO Ted Sarandos

Netflix CEO Ted Sarandos

Netflix CEO Ted Sarandos: వరల్డ్ లోనే టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఇండియాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆయన టాలీవుడ్ హీరోలను వరుసగా కలుస్తున్నారు. మొన్న చిరంజీవి, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబుతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ అయ్యారు. వరుసగా స్టార్స్ అందరినీ కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మొదట చిరంజీవిని కలిసి ఆయన లంచ్ చేశారు. అనంతరం రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో సంభాషించారు. నిన్న నందరమూరి కుటుంబంతో గడిపారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆయన లంచ్ చేశారు. ఈ సందర్హంగా కల్యాణ్ రామ్, కొరటాల శివతో మాట్లాడారు. కాగా ఈ రోజు మహేశ్‌బాబును కలిశారు. గుంటూరు కారం సినిమా సెట్ లో హీరో మహేశ్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ ను టెడ్ కలిశారు. టెడ్ బృందంతో దిగిన ఫొటోలను మహేశ్ షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Praja Darbar 2nd Day : రెండోరోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున పోటెత్తిన ప్రజలు