Rajinikanth : రజిని తర్వాత నా గురువు అతనే..!

Rajinikanth గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి డ్యాన్స్ మాస్టర్ గా మారి అక్కడ నుంచి డైరెక్టర్ గా ఆ తర్వాత హీరోగా మారిన లారెన్స్

Published By: HashtagU Telugu Desk
After Rajinikanth He Is My Guru Says Lawrence Master

After Rajinikanth He Is My Guru Says Lawrence Master

Rajinikanth గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి డ్యాన్స్ మాస్టర్ గా మారి అక్కడ నుంచి డైరెక్టర్ గా ఆ తర్వాత హీరోగా మారిన లారెన్స్ (Lawrence) తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఈమధ్యనే చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లారెన్స్ ఆ సినిమాతో నిరాశ పరచాడు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో జిగర్ తండ డబుల్ ఎక్స్ లో నటించాడు. ఈ సినిమాలో ఎస్.జె సూర్య కూడా నటించాడు.

జిగర్ తండా 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజు గురించి ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు లారెన్స్ మాస్టర్. తను ఎప్పుడు సూపర్ స్టార్ రజినికాంత్ నే గురువు అని అంటానని ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju)ని గురువుగా భావిస్తున్నానని అన్నారు లారెన్స్ మాస్టర్. జిగర్ తండ 2 సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా తో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది మరోసారి అందరికీ తెలుస్తుందని అన్నారు.

ఈ సినిమాలో ఎస్.జె సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం బాగుందని చెప్పారు. జిగర్ తండ 2 కి పోటీగా కార్తీ నటించిన జపాన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. రెండు డిఫరెంట్ సినిమాలు అవడంతో రెండిటికీ ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది.

Also Read : Prabhas Sandeep Vanga : ప్రభాస్ స్పిరిట్ మొదలయ్యేది ఎప్పుడంటే..!

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 06 Nov 2023, 11:31 PM IST