Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం తో గుంటూరు కారం సినిమా చేశాడు. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో సినిమా వచ్చింది. గుంటూరు కారం లో సరికొత్త మహేష్ ని చూపించాడు త్రివిక్రం. ఐతే సినిమాలో ఆయన మార్క్ డైలాగ్స్ లేవని కొందరు అసంతృప్తి వ్యక్తపరచినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.
గుంటూరు కారం తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అన్నది ఊహించడం కష్టం. అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఒక భాగమా రెండు భాగాలా అన్నది తెలియదు కానీ రాజమౌళి కోసం మహేష్ కూడా 3 ఏళ్లు టైం ఇచ్చేశాడని తెలుస్తుంది.
ఐతే రాజమౌళి తర్వాత మహేష్ మళ్లీ త్రివిక్రం తోనే సినిమా చేస్తాడని టాక్. గుంటూరు కారం తర్వాత మహా అయితే త్రివిక్రం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆఫ్టర్ రాజమౌళి మహేష్ త్రివిక్రం బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నాడట. అందుకే త్రివిక్రం తోనే సినిమా ప్లాన్ చేస్తారని టాక్. ఐతే రాజమౌళి సినిమాతో ఎలాగు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి త్రివిక్రం సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.