Malavika Mohanan : రాజా సాబ్ తర్వాత 2 కోట్ల హీరోయిన్ అవుతుందా..?

మలయాళ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలుగులో మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డబ్బింగ్ సినిమాతో వచ్చినా సరే అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్

Published By: HashtagU Telugu Desk
After Raja Saab Malavika Mohanan Will Demand 2 Crores For Movie

After Raja Saab Malavika Mohanan Will Demand 2 Crores For Movie

మలయాళ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలుగులో మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డబ్బింగ్ సినిమాతో వచ్చినా సరే అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అమ్మడు ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో టాప్ లేపేందుకు రెడీ అవుతుంది మాళవిక. ప్రభాస్ సినిమా చేస్తుంది కదా అని ఒకరిద్దరు దర్శకులు ఆమెను హీరోయిన్ గా అడిగితే రాజ సాబ్ రిలీజ్ తర్వాతే ఏ సినిమా అయినా అంటుందట.

We’re now on WhatsApp : Click to Join

అమ్మడి ప్లాన్ ఏంటంటే సినిమా ఎలాగు బంపర్ హిట్ కొడుతుంది కాబట్టి ఆ సినిమా తర్వాత తను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తారని అనుకుంటుంది. ప్రభాస్ సినిమా చేశాక కచ్చితంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మాళవిక రేంజ్ మారిపోతుంది. ఆ టైం లో అమ్మడు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఓకే అంటారు.

ప్రస్తుతం సినిమాకు కోటి మాత్రమే తీసుకుంటున్న మాళవిక ప్రభాస్ సినిమా తర్వాత ఆ రేటు డబల్ చేయాలని అనుకుంటుంది. రాజా సాబ్ అనుకున్న విధంగా హిట్ అయితే మాత్రం మాళవిక రేంజ్ మారినట్టే. అంతేకాదు అమ్మడు అప్పటివరకు హోల్డ్ లో పెట్టిన సినిమలన్నీ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది.

సరిగా కాన్సెంట్రేట్ చేస్తే చాలు కానీ మాళవిక తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ బాగా ఉన్నాయి. సినిమాలతోనే కాదు అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది. మాలవిక లాగా ఫోటో షూట్స్ తో గ్లామర్ ట్రీట్ ఇంకెవ్వరు ఇవ్వలేరని చెప్పొచ్చు.

Also Read : Rashmika Mandanna : చీరకట్టడం ఎప్పటికీ తప్పు కాదు.. అలా కట్టి కుర్రాళ్లకి నిద్రలేకుండా చేయడం మాత్రం నేరమే..!

  Last Updated: 03 Feb 2024, 05:36 PM IST