Site icon HashtagU Telugu

Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో అతనేనా..?

After Pushpa 2 Sukumar planning movie with that Hero

After Pushpa 2 Sukumar planning movie with that Hero

Sukumar పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2ని సిద్ధం చేస్తున్నాడు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా కృషి చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ ఫిక్స్ చేశారు. పుష్ప 2 సినిమాపై ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వస్తారో దానికి మించి సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుంది కానీ దానికి కొంత టైం ఉంటుందని అంటున్నారు.

పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్స్ట్ హీరో ఎవరు అంటే దాదాపు మళ్లీ మెగా హీరోతోనే సుకుమార్ సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తోనే సుకుమార్ తన నెక్స్ట్ సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. చరణ్ లోని నటుడిని వెలికి తీసిన సినిమా రంగస్థలం సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చింది. అంతకుముందు వరకు చరణ్ ఒక స్టార్ హీరో అనే చెప్పుకునే వారు రంగస్థలం లోనే అతను నటుడిగా మార్కులు కొట్టేశాడు.

రంగస్థలం కాంబో రిపీట్ అయితే ఈసారి అంతకుమించి సినిమా వస్తుందని చెప్పొచ్చు. పుష్ప తర్వాత సుకుమార్ చేసే సినిమాపై ఆడియన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత తన 16వ సినిమాగా బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా ఉంది.

ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. పుష్ప 2 రిలీజ్ టైం కు సుకుమార్ తన నెక్స్ట్ సినిమా హీరోని అనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది. సుకుమార్ తో మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారట.

Also Read : Mrunal Thakur : మృణాల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?