Site icon HashtagU Telugu

Ram Charan: ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

Ramcharan

Ramcharan

ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు పాట ఆస్కార్స్ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ సెలబ్రేషన్స్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానుల ఘన స్వాగతం పలికారు. తన కారు సన్‌రూఫ్ ద్వారా అభిమానులను పలుకరించి ఉత్సాహపర్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన కారును చుట్టుముట్టి ఆర్‌ఆర్‌ఆర్ జెండాలు చేతపట్టి , పూలు జల్లు చల్లుతూ నినాదాలు చేశారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం పట్ల రామ్ చరణ్ (Ram Charan) ఎమోషనల్ అయ్యారు.

“ఈ ప్రయాణం ప్రత్యేకమైనది.. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు నటులుగా మేము ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈ రోజు, ఇది మా సినిమా లేదా మా పాట ప్రజల పాటగా మారింది. జపాన్ నుండి USA వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఓన్ చేసుకున్నారు. మా సహకరించిన ప్రతిఒక్కరిని థ్యాంక్స్ ” అని అన్నాడు మెగా హీరో. ఈ నేపథ్యంలో ఇక రామ్ చరణ్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటి కానున్నారు.

ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటలో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా సరి సమానంగా ఇరగదీసారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌‌ను కాకుండా .. కేవలం ప్రధాని కార్యాలయం రామ్ చరణ్‌ను (Ram Charan) మాత్రమే ఎందుకు ఆహ్వానించిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

Also Read: Puneeth Rajkumar: అప్పు వి మిస్ యూ.. ఘనంగా పునీత్ రాజ్ కుమార్ జయంతి