Vijay Devarakonda New Film : నెక్ట్స్ మిషన్ లాంచ్…విజయ్ తో మరో మూవీ అనౌన్స్ చేసిన పూరీ..!!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇప్పటికే లైగర్ వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Vijay Puri

Vijay Puri

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇప్పటికే లైగర్ వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో మూవీ రాబోతోందన్న వార్తలు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా పాన్ ఇండియా సినిమా అని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అని అన్నారు. అయితే లేటెస్టుగా విజయ్ దేవరకొండ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ తో తన ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాడు.

ఇవాళ విజయ్ తన కొత్త మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను పంచుకున్నాడు. పోస్టర్ లో అక్షాంశం, రేఖాంశం విలువలున్నాయి. 14:20అవర్స్, 19.0760డిగ్రీలు నార్త్, 72,8777డిగ్రీల ఈస్ట్ నెక్ట్స్ మిషన్ లాంచ్ అంటూ కొత్త మూవీకి సంబంధించిన లాంచ్ అప్ డేట్ ను ఇచ్చాడు దేవరకొండ. ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ముంబైను చూపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని సంగతులు మార్చ్ 29న వెల్లడికానున్నాయి. అయితే ఇప్పటికే లైగర్ షూటింగ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ…ప్రస్తుతం పూరీ తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. లైగర్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.

  Last Updated: 28 Mar 2022, 01:45 PM IST