Site icon HashtagU Telugu

krishnam raju : ఐదేళ్ల తర్వాత తెర ముందుకు..!

Krishnam Raju

Krishnam Raju

తెలుగు తెరపై కృష్ణంరాజుది ప్రత్యేకస్థానం. రెబల్ స్టార్ గా ఎన్నో శక్తివంతమైన పాత్రలో అభిమానులను అలరించారాయన. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా.. ఇతర హీరోల్లోతనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. కృష్ణంరాజు ‘బిల్లా, రెబల్’ సినిమాల్లో ప్రభాస్ తో స్క్రీన్ చేసుకొని ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. రుద్రమదేవిలోనూ కనిపించారు. మళ్లీ ‘రాధేశ్యామ్’ మూవీలో పెద్దాయన కనిపించనున్నారు. అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత కృష్ణంరాజు స్క్రీన్ మీద కనిపించబోతున్నారు.

ఆధ్యాత్మిక గురువు ‘పరమహంస’గా కనిపించనున్నారు. తాజాగా కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. కాషాయ దుస్తుల్లో ప్రసన్న వదనంతో రుద్రాక్ష చేతబూనిన కృష్ణంరాజును ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో కృష్ణం రాజుతో పాటు భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.