Kalki 2898 AD : చిరంజీవితో స్టార్ట్ అయ్యింది.. ఇప్పుడు అమితాబ్, విజయ్.. ఈసారైనా ప్రశంసలు..

చిరంజీవితో స్టార్ట్ అయ్యిన ట్రెండ్. ఇప్పుడు అమితాబ్, విజయ్ తో ముందుకు వెళ్తుంది. మరి ఈసారైనా ప్రశంసలు..

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 11:53 AM IST

Kalki 2898 AD : మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు సినిమా పరిశ్రమలో కూడా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరోల చిన్నప్పటి పాత్రని చూపించడం కోసం.. ఎవరో ఒక ఆర్టిస్ట్ తో చేయించేవారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని వయసు మళ్ళిన హీరోలని కూడా యంగ్ గా చూపిస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ‘కల్కి’ మూవీలో అమితాబ్ బచ్చన్ ని డీ ఏజింగ్ చేసి యంగ్ లుక్ లో చూపించారు. కల్కి 2898 AD నుంచి నిన్న అమితాబ్ గ్లింప్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ గ్లింప్స్ లో అమితాబ్ కి సంబంధించిన ఓ యంగ్ లుక్ ని కూడా చూపించారు. ఈ డీ ఏజింగ్ షాట్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. ఒకప్పుడు అమితాబ్ ఎలా ఉండేవారు అలా చూపించి.. ఆడియన్స్ నుంచి మూవీ టీం ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం డీ ఏజింగ్ టెక్నాలజీ ఉపయోగించి మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీ ట్రెండ్ ని చిరంజీవి గతంలోనే స్టార్ట్ చేసారు.

ఆచార్య సినిమాలో చిరంజీవి టీనేజ్ లుక్ ని డీ ఏజింగ్ చేసి చూపించారు. కానీ అది ఆడియన్స్ కి నచ్చలేదు. దీంతో పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ సినిమా తరువాత ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో కూడా హీరో విజయ్ ని యంగ్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ డీ ఏజింగ్ లుక్ కి సంబంధించిన పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. పోస్టర్ లోని ఆ లుక్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.

కల్కి గ్లింప్స్ లోని అమితాబ్ డీ ఏజింగ్ లుక్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ పోస్టర్ లోని విజయ్ డీ ఏజింగ్ లుక్.. ప్రస్తుతానికి ఆడియన్స్ ని ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంటున్నాయి. మరి సినిమాలో కూడా ఇదే రేంజ్ క్వాలిటీతో డీ ఏజింగ్ లుక్స్ కనిపిస్తే.. ప్రశంసలు అందుతాయి, లేకపోతే ఆచార్య మూవీలా విమర్శలు తప్పవు.