Site icon HashtagU Telugu

Pushpa Recap : బాహుబలి, కె.జి.ఎఫ్ కి అలా.. మరి పుష్ప కోసం సుక్కు ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?

After Pushpa 2 Sukumar planning movie with that Hero

After Pushpa 2 Sukumar planning movie with that Hero

Pushpa Recap పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా సీక్వెల్ బాట పడుతున్న టైం లో వాటికి తగిన ప్లానింగ్ కూడా చేస్తున్నారు మేకర్స్. బాహుబలి ది బిగినింగ్, ది కన్ క్లూజన్ సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయితే బాహుబలి 2 లో బాహుబలి 1కి సంబంధించి రీకాప్ చేస్తూ ఒక ప్రాణం సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఆ పాట మొత్తం బాహుబలి 1 కథను చెప్పింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక కె.జి.ఎఫ్ సినిమాలో కూడా పాటలా కాకుండా కట్ షాట్స్ తో కె.జి.ఎఫ్ 1 మొత్తం చూపించారు. కె.జి.ఎఫ్ 2 లో ప్రశాంత్ నీల్ అలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 లో పుష్ప 1 కథ ఎలా గుర్తు చేస్తాడు అన్నది ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఆడియన్స్.

సుకుమార్ ఈ విషయాన్ని ఎలా ప్లాన్ చేసి ఉంటారు. పుష్ప 2 చూసేందుకు వచ్చిన ఆడియన్స్ కి పుష్ప 1 ని ఎలా గుర్తు చేస్తాడు. పుష్ప 1 కథని ఎలా చెబుతాడన్నది ఆసక్తికరంగా మారింది.

పుష్ప 2 ప్రతి విషయంలో సుక్కు ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. లాస్ట్ ఇయర్ రిలీజైన పుష్ప 2 టీజర్ సినిమాపై భారీ హైప్ తెచ్చింది. కచ్చితంగా పుష్ప 1 రీకాప్ విషయంలో కూడా సుకుమార్ సీక్రెట్ ప్లాన్ ఏదైనా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. పుష్ప 2 పై బాలీవుడ్ ఆడియన్ స్కూడా భారీ అంచనాలతో ఉన్నారు. మరోసారి పుష్ప రాజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

Also Read : Dhanush Nagarjuna Multistarrer Title : ధనుష్, నాగార్జున క్రేజీ మల్టీస్టారర్ టైటిల్ ఇదేనా.. ఈసారి శేఖర్ కమ్ముల యాక్షన్ మోడ్..!