Vijay Devarakonda టాలీవుడ్ లో యువ హీరోల్లో స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ అందరినీ రౌడీస్ అని పిలుస్తూ అతనే ఒక పెద్ద రౌడీ స్టార్ గా ఎదిగాడు. లైగర్ తో కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో కెరీర్ లో కాస్త జాగ్రత్త పడుతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి సినిమా తో జస్ట్ ఓకే అనిపించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు.
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన ఫ్యాన్ బేస్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తన ఇన్ స్టా గ్రాం లో 21 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేశాడు విజయ్ దేవరకొండ. తెలుగు స్టార్స్ లో అల్లు అర్జున్ 25 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ లో ఉండగా ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరు కూడా ఈ రేంజ్ ఫాలోవర్స్ రీచ్ కాలేదు కానీ విజయ్ మాత్రం అల్లు అర్జున్ తర్వాత స్థానాన్ని సంపాదించాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురం డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.