Site icon HashtagU Telugu

Adivi Sesh Dulquer Salman Multistarer : అడివి శేష్.. దుల్కర్ సల్మాన్.. అదిరిపోయే మల్టీస్టారర్..!

Adivi Sesh Dulquer Salman Multistarer Movie Planning

Adivi Sesh Dulquer Salman Multistarer Movie Planning

Adivi Sesh Dulquer Salman Multistarer టాలీవుడ్ యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరో అడివి శేష్. కెరీర్ మొదట్లో సొంత కథలతో ప్రయోగాలు చేసి విఫలమైన అడివి శేష్ క్షణం నుంచి అతని కథలకు ఆడియన్స్ ట్యూన్ అయ్యారు. ఆ సినిమా నుంచి ప్రతి సినిమా డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ అదరగొట్టేస్తున్నాడు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల మీద మంచి బజ్ ఉంది.

ఇక మరోపక్క మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. మలయాళంలో తన మార్క్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న దుల్కర్ తెలుగులో కూడా మంచి కథలతో వస్తున్నాడు. మహానటి, సీతారామం సినిమాలు అతని కోసమే అన్నట్టుగా చేసి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబినేషన్ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇదిలాఉంటే అడివి శేష్, దుల్కర్ సల్మాన్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ బడా బ్యానర్ ఒక అద్భుతమైన కథ తో ఈ ఇద్దరితో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఆల్రెడీ ఇద్దరి హీరోలతో కథా చర్చలు పూర్తయ్యాయట. త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.

ఈ మూవీ డైరెక్టర్ మిగతా కాస్టింగ్ ఏంటన్నది కూడా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. దుల్ఖర్ సల్మాన్ తో అడివి శేష్ ఇద్దరు వెరైటీ కథలతో సినిమాలు తీసే యాక్టర్స్ కావడంతో ఈ మల్టీస్టారర్ కచ్చితంగా అదిరిపోతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Also Read : Mahesh Babu : మహేష్ 8 డిఫరెంట్ లుక్స్.. SSRMB లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!