Site icon HashtagU Telugu

Sesh & Shruti: అడవి శేష్ మరో పాన్ ఇండియా, శృతి హాసన్ తో రొమాన్స్

Shesh

Shesh

Sesh & Shruti: అడివి శేష్ మిగతా వాళ్లకు భిన్నంగా ఉంటాడనే ఇమేజ్‌ను ఎప్పుడూ మెయింటైన్ చేస్తుంటాడు. ‘క్షణం’, ‘గూడచారి’, ‘ఎవరు’, ‘మేజర్‌’ వంటి సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘జి2’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి మరో పెద్ద ప్రకటన వచ్చింది.

ఇది మెగా పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఈ చిత్రంలో అడివి శేష్ మరియు శృతి హాసన్ నటించనున్నారు. ‘మేజర్’ తర్వాత శేష్ రెండో హిందీ సినిమా అవుతుంది. ప్రస్తుతానికి టైటిల్‌ను మేకర్స్ గోప్యంగా ఉంచారు.

ప్రాజెక్ట్ యొక్క కీలకమైన వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. అయితే రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పోస్టర్లు, టైటిల్ రివీల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘క్షణం’ మరియు ‘గూడాచారి’ సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు షానీల్ DOP గా పనిచేశాడు. ఈ మూవీకి కూడా అతను పనిచేసే అవకాశం ఉంది. అయితే మొదటిసారి శేష్ శృతి హాసన్ తో నటించబోతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Auto Drivers: ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. ఆందోళనలో ‘హైదరాబాద్’ ఆటోవాలలు!

Exit mobile version