Adivi Sesh :అడివి శేష్ తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ చేతిలో డెకాయిట్, గూడాచారి 2 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే డెకాయిట్ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా గూఢచారి సీక్వెల్ సినిమాలో హీరోయిన్ ని అనౌన్స్ చేసాడు అడివి శేష్.
గూఢచారి ఫస్ట్ పార్ట్ లో శోభిత ధూళిపాళ నటించింది. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుంది. దీంతో పార్ట్ 2 లో బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి ని తీసుకొచ్చారు. జబ్ వుయ్ మెట్ లాంటి సూపర్ హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన వామికా ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. గతంలో తెలుగులో సుధీర్ బాబు హీరోగా చేసిన భలే మంచి రోజు సినిమాలో కూడా వామికా హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అడివి శేష్ గూఢచారి సీక్వెల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. వామికా గబ్బి పాత్రను పరిచయం చేస్తూ ఏజెంట్ 116 అనే పాత్రలో నటిస్తుందని తెలిపారు. అడివి శేష్ మేజర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని ఈ సంవత్సరం డెకాయిట్, గూఢచారి సీక్వెల్ సినిమాలతో రానున్నాడు.
My partner in c̶r̶i̶m̶e̶ adventure 💥💥
Welcome to the mission, #WamiqaGabbi
It's gonna be amazing to run with you in Europe!
THUNDER GLIMPSE loading this Month🔥#G2 #Goodachari2 pic.twitter.com/Hn01fiUB9v
— Adivi Sesh (@AdiviSesh) January 7, 2025
Also Read : Pushpa 2 Collections : పుష్ప 2 కి తమిళనాడులో భారీ నష్టాలు..