Adivi Sesh : అడివి శేష్ మీద 150 కోట్ల బడ్జెట్.. ఆ రెండిటి మీద భారీగా పెట్టేస్తున్నారు..!

యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు తన వందు ప్రయత్నం చేస్తున్నాడు అడివి శేష్ (Adivi Sesh). అతని సినిమా వస్తుంది అంటే ఆడియన్స్

Published By: HashtagU Telugu Desk
Adivi Sesh 150 Crores Budget For Two Movies

Adivi Sesh 150 Crores Budget For Two Movies

యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు తన వందు ప్రయత్నం చేస్తున్నాడు అడివి శేష్ (Adivi Sesh). అతని సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ఒకరమైన క్యూరియాసిటీ ఉంటుంది. క్షణం నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన మేజర్, హిట్ 2 వరకు అడివి శేష్ సినిమా అంటే కంపల్సరీ మనం పెట్టిన టికెట్ కి సాటిస్ఫై అవ్వొచ్చని ఫిక్స్ అయ్యారు.

We’re now on WhatsApp : Click to Join

ప్రస్తుతం అడివిశేష్ గూఢచారి 2, డకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు కలిపి 150 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. రెండు సినిమాలు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెండికి కలిపి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. అడివి శేష్ సినిమాకు అంత బడ్జెట్ ఏంటని కొందరు అంటున్నా. అడివి శేష్ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా ఓకే అనేలా తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు.

గూఢచారి 2 క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతుండగా డకాయిట్ కూడా ఆ సినిమాకు ఈక్వెల్ గా రాబోతుంది. ఈ రెండు సినిమాలు బడ్జెట్ 150 కోట్లే అయినా అంతకుమించిన కంటెంట్ భారీ స్థాయిలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక గూఢచారి 2 సినిమాను 2025 లో రిలీజ్ ప్లాన్ చేస్తుండగా డకాయిట్ ఈ ఇయర్ లో రిలీజ్ ఉంటుందని అంటున్నారు.

Also Read : Akhil : సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ ఎందుకు.. అసలు స్టోరీ ఇది.. హోంబలె తో అఖిల్ మూవీ డైరెక్టర్ కూడా..!

అడివి శేష్ ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. గూఢచారి 2 లో అడివి శేష్ సరసన బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుండగా డకాయిట్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

  Last Updated: 25 Jan 2024, 05:20 PM IST