Site icon HashtagU Telugu

Adivi Sesh : అడివి శేష్‌ని సర్‌ప్రైజ్ చేసిన పవన్ తనయుడు అకిరా.. ఫిదా అయిపోయిన శేష్..

Adivi Sesh ,pawan Kalyan ,akira Nandan

Adivi Sesh ,pawan Kalyan ,akira Nandan

Adivi Sesh : ‘పంజా’ సినిమాలో విలన్ గా నటించిన అడివి శేష్‌కు, పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. నిజం చెప్పాలంటే అకిరా.. అడివి శేష్‌ని ఒక సొంత అన్నయ్యలా ట్రీట్ చేస్తాడు. అయితే ఈ స్నేహం పంజా షూటింగ్ సమయంలో పుట్టింది కాదు. మరి వీరిద్దరి స్నేహం ఎలా మొదలయింది..?

ఈ విషయానికి అడివి శేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ‘ఉస్తాద్’ టాక్ షోకి అడివి శేష్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో అకిరాతో స్నేహం గురించి మాట్లాడుతూ.. “ఒక కామన్ ఫ్రెండ్ వల్ల మేము ఇద్దరం కలిసాము. ఆ సమయంలో అకిరా నా సినిమాలు అంటే ఇష్టమని చెప్పాడు. అప్పుడు తనని చూసి కూల్ అండ్ సింపుల్ గా ఉన్నాడని అనుకున్నాను. కానీ ఒకసారి నా సినిమాలోని ఓ సాంగ్ ని పియానో పై తానే ప్లే చేసి నాకు పంపించాడు. అది చూసి నేను ఫిదా అయ్యిపోయాను. అప్పటి నుంచి వాడిని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాకు వాడంటే ప్రాణం” అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు, అకిరాకి మ్యూజిక్ పై చాలా జ్ఞానం ఉందని, పవన్ కళ్యాణ్ లాగానే ఎన్నో పుస్తకాలు చదువుతాడని చెప్పుకొచ్చారు. తాను వినే మ్యూజిక్, చదివే పుస్తకాలను అడివి శేష్ కి కూడా రిఫర్ చేస్తాడంట. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. ఇక భవిషత్తులో పవన్ కళ్యాణ్, అకిరాతో విడివిడిగా సినిమా చేసే అవకాశం వస్తే, మొదటి ఎవరితో చేస్తావు.. అని మనోజ్ అడివి శేష్ ని ప్రశ్నించగా, శేష్ బదులిస్తూ.. ”అకిరాతోనే చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. పవన్ అంటే గౌరవం ఉందని, కానీ అకిరా అంటే ప్రాణం అని, అందుకే తనతోనే సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు.

Also read :Pawan Kalyan : ఫ్యాన్స్‌లా వచ్చి బ్లేడ్‌తో దాడి చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్..