Bandi Trailer : హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్‌తో ‘బంధీ’.. ట్రైలర్ రిలీజ్..

2017లో సినిమాలకు దూరమైన ఆదిత్య ఇటీవలే మళ్ళీ వరుసగా సినిమాలు మొదలుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Aditya Om Single Character Movie Bandi Trailer Released

Aditya Om Single Character Movie Bandi Trailer Released

లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆదిత్య ఓం(Aditya Om) ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశాడు ఆదిత్య ఓం. 2017లో సినిమాలకు దూరమైన ఆదిత్య ఇటీవలే మళ్ళీ వరుసగా సినిమాలు మొదలుపెట్టారు.

కొన్ని రోజుల క్రితమే దహనం, నాతో నేను అనే అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిత్య ఓం ఇప్పుడు బంధీ(Bandi) అనే ఓ ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కేవలం సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కనుంది.

గల్లీ సినిమా బ్యానర్ పై వెంకటేశ్వరరావు దగ్గు, తిరుమల రఘు నిర్మాణంలో తిరుమల రఘు దర్శకత్వంలో ఆదిత్య ఓం సింగిల్ క్యారెక్టర్ తో బంధీ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడగా.. హీరోని కిడ్నాప్ చేసి ఓ అడవిలో వదిలేస్తే అక్కడ్నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనిషి ఆహరం, నీరు, డబ్బు, స్వాతంత్రం, కోరికలు కోరుకుంటారని చూపించాడు. ఇండైరెక్ట్ గా వాటిల్లో బంధీ అవుతున్నారని చెప్పాడు. చివర్లో ఆదిత్య ఓం నగ్నంగా ఉన్న షాట్ కూడా చూపించడం గమనార్హం.

సింగిల్ క్యారెక్టర్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రిలీజ్ చేసిన బంధీ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఇక ఈ సినిమాలో పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని కూడా చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది బంధీ. త్వరలోనే ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.

Also Read : Mohan Babu : కన్నప్ప సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు.. 600 మందితో 90 రోజుల పాటు..

  Last Updated: 23 Dec 2023, 05:46 PM IST