Site icon HashtagU Telugu

Aditya 369 Re Release : ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

Aditya 369 Re Release

Aditya 369 Re Release

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘ఆదిత్య 369’ (Aditya 369 ) మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలై టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ (Time Travel Concept)తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రం, ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా 4K డిజిటల్ & 5.1 సౌండ్ క్వాలిటీలో ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. బాలకృష్ణతో పాటు అమీషా పాటెల్, తిక్కు టిల్వన్, మోహిని, తమ్మారెడ్డి భార్గవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, ఇళయరాజా సంగీతం అందించారు.

CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

ఈ చిత్రాన్ని మరింత మెరుగుగా అందించేందుకు ప్రసాద్స్ డిజిటల్ టీమ్ 6 నెలలపాటు శ్రమించి, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా విజువల్స్‌ను మెరుగుపరిచినట్లు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. “ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఇప్పటికీ ఎంతో మంది ఆదిత్య 369 గురించి మాట్లాడుతుండటం గర్వంగా ఉంది. రీ-రిలీజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని ఆయన వెల్లడించారు.

LB Nagar MLA : సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

నందమూరి అభిమానులను మరో సారి థ్రిల్ చేయడానికి, ‘ఆదిత్య 369’కి సీక్వెల్ కూడా రాబోతోందని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షోలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, తనయుడు నందమూరి మోక్షజ్ఞ ప్రధాన పాత్రలో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ పేరుతో సినిమా తెరకెక్కనుందని చెప్పారు. ఈ రీ-రిలీజ్ ద్వారా నందమూరి బాలయ్య సినీ కెరీర్‌లో ఓ చిరస్మరణీయ చిత్రాన్ని మళ్లీ చూడనుండడం అభిమానులకు ఖచ్చితంగా ఓ గొప్ప అనుభూతిగా మారనుంది.