Aditi Rao Weds Siddharth : లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా ? తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో !! హిందీ సినిమాలతో పేరు, గుర్తింపు తెచ్చుకున్న అదితి రావు హైదరి తెలంగాణ మూలాలున్న అమ్మాయి. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె ఒకరు. అదితి తల్లి విద్యా రావు హిందుస్థానీ క్లాసికల్ సింగర్. అందుకే వనపర్తిలో అదితి రావు పెళ్లి చేసుకున్నారు. తమ మ్యారేజ్ గురించి అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మీడియాకూ సమాచారం ఇవ్వలేదు. పెళ్లి టైంలో ఎవరినీ దేవాలయంలోకి అనుమతించలేదు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కనుక రహస్యంగా ఉంచాలని, తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మాత్రమే చెబితే చాలని ఇద్దరూ అనుకున్నారట.
We’re now on WhatsApp. Click to Join
ప్రేమ మొదలైంది ఇలా..
సిద్ధార్థ్, అదితి రావు హైదరి(Aditi Rao Weds Siddharth) కలిసి మహా సముద్రం మూవీలో నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఆ తర్వాత ఇద్దరూ జంటగా ఉండగా.. ఒకసారి కెమెరా కంటికి చిక్కారు. దీంతో వాళ్ల ప్రేమ విషయం బయటకు వచ్చింది. లవ్ స్టోరీ విషయాన్ని సిద్దార్థ్ తన నోటి నుంచి ఎప్పుడూ చెప్పలేదు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదితితో పాటు కెమెరాకు ఫోజులు ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.
Also Read :12 Gazans Drown : ఆహార పొట్లాల కోసం సముద్రంలోకి దూకి.. 12 మంది మృతి!
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఆమె ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అంత రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. ఆ సీక్రెట్ మ్యారేజ్ గురించి మరువక ముందే.. ఇప్పుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరి కూడా సీక్రెట్‌గానే మ్యారేజ్ చేసుకోవడం గమనార్హం.
Also Read :Sunita : కేంద్రం ఆడుతున్న నాటకానికి కోర్టులోనే తెరదించుతాంః భార్య సునీత
హీరోయిన్ అతిథి రావు హైదరితో సిద్ధార్థ వివాహం
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరిగిన వివాహం#Siddharth #AditiRaoHydari #Tollywood #TeluguCinema #TeluguFilmNagar #Tollywoodhub https://t.co/WE4GJFlTCW pic.twitter.com/1dMgnNO45M— TollywoodHub (@tollywoodhub8) March 27, 2024