Site icon HashtagU Telugu

Aditi Sidharth Dating: సిద్దార్థ్, అదితి డేటింగ్.. లేటెస్ట్ పిక్ వైరల్!

star couple in dating, sidharth

Sidharth

‘‘డేటింగ్ (Dating), లివింగ్ రిలేషన్ షిప్’’ ప్రస్తుత రోజుల్లో తరచుగా వినిపిస్తున్న మాటలు. ఈ ప్రభావం సీని ఇండస్ట్రీపై కొంచెం ఎక్కువేనని చెప్పాలి. తాజాగా ఓ జంటపై పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు రూమార్స్ వస్తున్నాయి. అదితి రావ్ హైదరీ (Aditi Rao), సిద్ధార్థ్‌ (Sidharth) లు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జంట అఫిషీయల్ గా ప్రకటించనప్పటికీ, ఇద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరు బహిరంగంగా మీడియాకు కనిపించిన విషయం కూడా తెలిసిందే.

సిద్ధార్థ్, అదితిల లేటెస్ట్ ఫోటో (Viral Pic) అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్‌లో వీరిద్దరికి సంబంధించిన ఫొటో చక్కర్లు కొడుతోంది. ఈ జంట ఒకే చొక్కా ధరించి ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధార్థ్ (Sidharth) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ‘Sunday Offering’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక అదితి పోస్ట్‌కి సమాధానమిస్తూ “ఈద్ కా చాంద్” అంటూ రియాక్ట్ అయ్యాడు.

అజయ్ భూపతి మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ మహాసముద్రంలో సిద్ధార్థ్ (Sidharth), అదితి రావుల కెమిస్ట్రీ చాలా మందికి నచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద క్లిక్‌గా కాలేదు. షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ డేటింగ్‌కు దిగారని అంటున్నారు. అదితి రావ్ హైదరి మొదట నటుడు సత్యదీప్ మిశ్రాను 2009లో వివాహం చేసుకున్నారు. 2013లో ఆయనకు దూరంగా ఉంటోంది. మరోవైపు సిద్ధార్థ్ మేఘనను వివాహం చేసుకున్నారు. 2003లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2007లో తమ బంధానికి తెరపడింది. విడిపోయిన వీరిద్దరూ డేటింగ్ (Dating) లో దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.