Aditi Rao Hydari-Siddharth: ఏంటి.. అదితి, సిద్దార్థ్ ల పెళ్లి జరగలేదా.. కేవలం ఎంగేజ్మెంట్ జరిగిందా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్ అదితి రావు హైదరి పేర్లు కూడా ఒకటి. గత కొద్దిరోజులుగా ఈ జంట పేర

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 08:01 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్ అదితి రావు హైదరి పేర్లు కూడా ఒకటి. గత కొద్దిరోజులుగా ఈ జంట పేరు సోషల్ మీడియాలో మారు మగదన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కంటిన్యూగా వార్తల్లో నిలిచిన ఈ జంట ఆ తర్వాత కొద్దిగా కాలం పాటు వీరి పేర్లు వినిపించలేదు. మరోసారి వీళ్ళిద్దరికీ పెళ్లి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి.

వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మార్చి 27న తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు. తాజాగా అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అదితి, సిద్దార్థ్ లు తీసుకున్న సెల్ఫీ ఫోటోని అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది.

దీంతో ఈ జంట నిన్న కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది. మొత్తానికి దాదాపు మూడేళ్ళుగా సాగుతున్న ప్రేమని నేడు అధికారికంగా చెప్పేసింది అదితి. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.