Site icon HashtagU Telugu

Nandi Awards : ప్రభుత్వాలు పట్టించుకోవు.. నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణ సోదరుడు..

Adiseshagiri Rao sensational comments on Nandi Awards

Adiseshagiri Rao sensational comments on Nandi Awards

సూపర్ స్టార్ కృష్ణ(Krishna) సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు(Adiseshagiri Rao) తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. కృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన మోసగాళ్లకు మోసగాడు(Mosagallaku Mosagadu) సినిమాను డిజిటలైజ్ చేసి అభిమానుల కొరకు 4K వర్షన్ లో కృష్ణ గారి పుట్టిన రోజు మే 31న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఆదిశేషగిరి రావు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్నీ తెలిపారు.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావుతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయాక రెండేళ్లు ఏపీ ప్రభుత్వం నంది అవార్డులని అందించింది. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవట్లేదు. పలువురు సినీ పెద్దలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దీని గురించి మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది.

తాజాగా నంది అవార్డులపై నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి పోయింది. ప్రభుత్వాలు అసలు వీటి గురించే పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డులకు విలువ ఉండేది. ఇప్పుడు నా దృష్టిలో ఆ అవార్డుకు విలువ పోయింది అని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read :   Mosagallaku Mosagadu: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్