Macherla Niyojakavargam: ‘మాచర్ల’ నుంచి మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్

వెర్సటైల్ హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'

Published By: HashtagU Telugu Desk
Macherla

Macherla

వెర్సటైల్ హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుంతం చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. మహతి స్వర సాగర్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించారు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మూడో పాట ‘అదిరిందే’ పాట తాజాగా విడుదలైంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్ తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. పాట వినిపించిన విధానం చెవులకింపుగా వుంది. పాటలో నితిన్, కృతి శెట్టిలా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టయిలీస్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స మూమెంట్స్ అలరించాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది. మాచర్ల ఆల్బమ్‌లో మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్ చేరిందని ఈ పాట చూస్తే అర్ధమౌతుంది.

కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మామిడాల తిరుపతి డైలాగ్స్, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.

  Last Updated: 23 Jul 2022, 02:57 PM IST