Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే!

పౌరాణిక ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది.

  • Written By:
  • Updated On - May 9, 2023 / 02:48 PM IST

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. పౌరాణిక ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అభిమానుల కోసం ఆదిపురుష్ ట్రైలర్‌ను ప్రదర్శించారు.

ట్రైలర్‌కి  పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాఘువుడి పాత్రలో ప్రభాస్, జానకీ పాత్రలో కృతి సనన్ సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇది నా రాముడి కథ.. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు.. ఆయన జీవితం సన్మార్గానికి నిదర్శనం.. ఆయన నామం రాఘవ’’ అనే డైలాగ్స్ (Dialogues) ఆసక్తిని రేపుతాయి.  సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి (Rama) ఆగమనం, చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు. అయితే మొత్తంగా ఈ ట్రైలర్ (Trailer) ను చూస్తే విజువల్ వండర్ గా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.

రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్.

మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా (World wide) 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా , ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Pushpa2 Item Song: పుష్ప2 ఐటెం సాంగ్ లో నటించే హాట్ బ్యూటీ ఎవరో తెలుసా!