Adipurush Openings: ఓపెనింగ్స్ లో ఆదిపురుష్ రికార్డ్, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్ధలయ్యేనా!

మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ పలు రికార్డులను కొల్లగొట్టే వీలుంది.

Published By: HashtagU Telugu Desk
Aidpurush

Aidpurush

ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే ఈ మూవీకి మంచి బజ్ వచ్చింది. ఈ మూవీని చూసేందుకు చాలామంది ఉత్సాహం చూపుతుండటంతో ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ క్రాష్ అయ్యాయంటే ఆదిపురుష్ క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత వాణిజ్య నిపుణుడు తరణ్ ఆదర్శ్ అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడారు.

ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీని కలుపుకొని మొత్త 5,47,240 టిక్కెట్లను విక్రయించబడినట్టు తెలిపారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాల్లో, ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేయబోతుందని తెలిపారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ మొదటిరోజు 40-55 కోట్ల రూపాయలను సులభంగా రాబట్టగలదని, ప్రజల ఆదరణను బట్టి అది పెరగవచ్చని అన్నారు. ఆదిపురుష్‌ ప్రేక్షకులను మెప్పించగలిగితే మొదటి మూడు రోజుల్లోనే 150-200 కోట్ల రూపాయలను ఈజీగా క్రాస్ చేస్తుందని తేల్చి చెప్పారు. పఠాన్ రికార్డును ఈజీగా అధిగమించేలా ఉన్నప్పటికీ, కేజీఎఫ్2, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను బీట్ చేయకపోవచ్చునని అన్నారు.

అయితే మొదటి రోజు మూవీకి సూపర్ హిట్ వస్తే ఆ రికార్డులను కూడా కొల్లగొట్టే అవకాశాలున్నాయని అయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదటివారం రోజుల్లో రూ. 200-250 కోట్లు రాబట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. “ఈ చిత్రం ఖచ్చితంగా బాహుబలి 1, సాహో, రాధే శ్యామ్ కంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంది. పఠాన్ రికార్డులను కూడా అధిగమించవచ్చునని క్రిటిక్స్ చెబుతున్నారు. పఠాన్ తర్వాత బాలీవుడ్ కు మరో హిట్ అవసరం. ఈ నేపథ్యంలో హిందీ చిత్రసీమ సైతం ఆదిపురుష్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: Shocking: ముసలోడే కానీ మహానుభావుడు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు!

  Last Updated: 15 Jun 2023, 05:37 PM IST