Site icon HashtagU Telugu

Adipurush : తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ టికెట్ రేట్లు.. ఎంత పెంచుతున్నారో తెలుసా? రేపే తెలుగు బుకింగ్స్ ఓపెనింగ్..

Adipurush Ticket rates hike in Telugu states

Adipurush Ticket rates hike in Telugu states

ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) రాముడు, సీత పాత్రల్లో, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసుర పాత్రలో రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధకాండ ఆధారంగా బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్(Adipurush). ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 160 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ ప్రమోషన్ చేస్తోంది. ఈ సంస్థ అధినేత TG విశ్వప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపు, బుకింగ్స్ ఓపెనింగ్ గురించి మాట్లాడారు.

నిర్మాత TG విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగింది. రెండు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రం టికెట్ రేట్లు పెంచట్లేదు. పెద్ద సినిమాలకు ఉండే టికెట్ రేటు ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ కి మాత్రం ఏరియాని బట్టి 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెంచుతున్నాము. డిస్ట్రిబ్యూటర్స్ తో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. నేడు తుది నిర్ణయం తీసుకుంటాము. అందుకే తెలుగులో బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. రేపు జూన్ 14 నుంచి ఆదిపురుష్ తెలుగు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అని తెలిపారు.

 

అయితే ఈ టికెట్ రేట్ల పెంపు కేవలం మొదటి మూడు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. ఆదిపురుష్ సినిమాకు నైజం ఏరోయా టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్ 3D : 266 రూపాయలు, 2D : 236 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 3D : 325 రూపాయలు, 2D : 295 రూపాయలు ఉండనున్నాయి.

 

Also Read : KGF Hero: బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కేజీఎఫ్ హీరో, అసలు మ్యాటర్ ఇదే!