Site icon HashtagU Telugu

Adipurush Ticket Price: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ తగ్గింపు.. ఫ్రీగా ఇచ్చిన వద్దంటున్న నెటిజన్స్

Adipurush

Prabhas Adipurush Movie gets clean U Certificate and run time locked

Adipurush Ticket Price: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. రామాయణంలోని ఒక భాగాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదని చెప్పాలి. ఇక కలెక్షన పరంగా చూసినా ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. విడుదలైన మొదటి వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో కలెక్షన్ల పరంగా భారీగా డ్రాప్ అయింది. ప్రస్తుతానికి 70 నుంచి 80 శాతం కలెక్షన్లు పడిపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ‘ఆదిపురుష్’ 3డి వెర్షన్ ధరను తగ్గిస్తున్నట్లు ‘ఆదిపురుష్’ ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న ధరని తగ్గిస్తూ రూ.112 గా ఫిక్స్ చేశారు. ఈ ఆఫర్ రేపటి నుండి ప్రారంభమవుతుంది జై శ్రీరామ్ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే చిత్ర యూనిట్ టికెట్ ధర తగ్గించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఫ్రీగా ఇచ్చినా వద్దంటున్నారు. సినిమాలో దమ్ము లేకపోతే టికెట్ రేట్స్ తగ్గిస్తే ఎం ప్రయోజనం అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. అయితే ఇలాంటి కామెంట్స్ ఈ చిత్రానికి కొత్తేమి కాదు. ఆదిపురుష్ ఆది నుంచి వివాదాలు, విమర్శలను మోస్తూనే ఉంది.

ఆదిపురుష్ 10 రోజుల్లో మొత్తం 274.55 కోట్లు రాబట్టింది. మొదటి వారాంతంలో మొత్తం 200 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద స్లో డౌన్ అయ్యింది. ఆదిపురుష్ 16 జూన్ 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో రాఘవ్ (రాముడు)గా ప్రభాస్, జానకి (సీత)గా కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.

Read More: 15 Km Traffic Jam : 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్..18 గంటలుగా పడిగాపులు