Site icon HashtagU Telugu

Adipurush : ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా.. ఎక్కడో తెలుసా?

Adipurush Movie Pre Release Event Date and place Fixed

Adipurush Movie Pre Release Event Date and place Fixed

ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతిసనన్(Krithi Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రామాయణం(Ramayanam) ఆధారంగా భారీగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. మొదట సినిమా టీజర్ రిలీజ్ తర్వాత విమర్శలు వచ్చినా అనంతరం ట్రైలర్, సాంగ్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ చేయబోతున్నారు.

ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్రయూనిట్.

జూన్ 6న తిరుపతి SV గ్రౌండ్స్ లో అత్యంత భారీగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పలు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ యూనిట్ తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కూడా చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తిరుపతి ఈవెంట్ కు హాజరవ్వనున్నారు. గతంలో ప్రభాస్ బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా తిరుపతిలోనే నిర్వహించడం విశేషం.

 

Also Read : Tiger Nageswara Rao : రవితేజ ఊర మాస్.. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్..