Adipurush Collections : ఆదిపురుష్ కలెక్షన్స్.. పది రోజులు అయినా 500 కోట్లు కూడా రాలే.. ఇలా అయితే కష్టమే

భారీ అంచనాలతో రిలీజవ్వడం, ప్రభాస్ హీరో కావడంతో సినిమా రిలీజయిన మూడు రోజుల్లోనే 340 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టారు.

Published By: HashtagU Telugu Desk
Adipurush movie collects only 450 crores gross collections in 10 days

Adipurush movie collects only 450 crores gross collections in 10 days

ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) రాముడిగా వచ్చిన సినిమా ఆదిపురుష్(Adipurush). సినిమా రిలీజ్ కి ముందు రామాయణం తీశామని చిత్రయూనిట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక సినిమా రిలీజయ్యాక సినిమాలో అసలు రామాయణం పాత్రల స్వరూపం, కథనం మార్చేయడం, డైలాగ్స్, గ్రాఫిక్స్ బాగోకపోవడంతో దేశవ్యాప్తంగా సినిమాపై విమర్శలు వచ్చాయి. ఇక డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ సినిమాపై నెగిటివిటి వస్తున్నా వివాదం అయ్యేలా పలు వ్యాఖ్యలు చేయడం, మేము రామాయణం తీయలేదు అని చెప్పడంతో వీరిద్దరిపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.

అయితే భారీ అంచనాలతో రిలీజవ్వడం, ప్రభాస్ హీరో కావడంతో సినిమా రిలీజయిన మూడు రోజుల్లోనే 340 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టారు. దీంతో చిత్రయూనిట్ విమర్శలని పట్టించుకోకుండా మరింత ప్రమోట్ చేశారు. అయితే వీకెండ్ అయిపోగానే ఆదిపురుష్ సినిమాని పట్టించుకోవడం మానేశారు. సినిమా రిలీజయి నిన్నటితో పది రోజులు అయింది. పది రోజుల్లో ఆదిపురుష్ సినిమా కేవలం 450 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

అందులో కూడా చాలా వరకు కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. బాలీవుడ్ లో ఆదిపురుష్ ని అసలు పట్టించుకోకపోవడంతో చిత్రయూనిట్ టికెట్ రేట్లు తగ్గించి జనాల్ని థియేటర్స్ కి రప్పించాలని చూస్తుంది. చిత్రయూనిట్ 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దిగితే 10 రోజుల్లో 500 కోట్లు కూడా రాలేదు. ఇక 1000 కోట్లు వచ్చే జాడ కనిపించడం లేదు. ఆ 450 కోట్లు కూడా గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే. షేర్ కేవలం 230 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఆదిపురుష్ సినిమా చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వనట్టు తెలుస్తుంది. ఈ వారం సినిమాలేమి లేకవడంతో ఆ కలెక్షన్స్ అయినా వచ్చాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా సరిగ్గా లేకుండా మీరెంత ప్రమోషన్స్ చేసినా, మీరెన్ని ఆఫర్స్ పెట్టినా జనాలు థియేటర్స్ కి రారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Also Read :  Adipurush Ticket Price: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ తగ్గింపు.. ఫ్రీగా ఇచ్చిన వద్దంటున్న నెటిజన్స్

  Last Updated: 26 Jun 2023, 07:30 PM IST