Adipurush : నేపాల్ లో ఆదిపురుష్ బ్యాన్.. ఆదిపురుష్ వల్ల నేపాల్‌లో ఇండియన్ సినిమాలకు పెద్ద దెబ్బ..

తాజాగా ఆదిపురుష్ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేశారు. నేపాల్ పూర్తి హిందూ దేశం అని తెలిసిందే. సీత దేవి ప్రస్తుత నేపాల్ లో పుట్టిన సంగతి తెలిసిందే. నేపాల్ వాళ్లకి సీత దేవి అంటే చాలా భక్తి.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 07:35 AM IST

ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా ఇటీవల రిలీజయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి కూడా రామాయణం(Ramayanam) తీస్తున్నామని భారీగా ప్రమోట్ చేశారు చిత్రయూనిట్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. మూల కథ మాత్రమే తీసుకొని అసలు రామాయణం ఆహార్యం, పాత్రల స్వరూపం మొత్తం మార్చేశారు. దీంతో చిత్రయూనిట్, డైరెక్టర్, రైటర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలతో ముందు నుంచి రామాయణం అని చెప్పిన చిత్రయూనిట్ ఇది రామాయణం కాదని చెప్పి మరింత వివాదంలో నిలిచింది. ఇక రైటర్ మనోజ్ రాసిన కొన్ని డైలాగ్స్ వివాదంగా మారడంతో అతనిపై ట్రోల్స్ వచ్చినా మనోజ్ తనని సమర్ధించుకోవడంతో దేశవ్యాప్తంగా అతనిపై విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఎక్కువవడంతో ఆ తర్వాత డైలాగ్స్ మారుస్తామంటూ చిత్రయూనిట్ ప్రకటించింది. ఇలా సినిమా రిలీజ్ దగ్గర్నుంచి ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉంది.

తాజాగా ఆదిపురుష్ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేశారు. నేపాల్ పూర్తి హిందూ దేశం అని తెలిసిందే. సీత దేవి ప్రస్తుత నేపాల్ లో పుట్టిన సంగతి తెలిసిందే. నేపాల్ వాళ్లకి సీత దేవి అంటే చాలా భక్తి. ఇప్పటికి అక్కడ సీతాదేవి పుట్టిన ప్రదేశంలో పెద్ద ఆలయం ఉంది. అయితే సినిమాలో సీతాదేవిని భారతదేశం స్త్రీగా అభివర్ణించారు. దీనిపై నేపాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో సినిమా రిలీజ్ రోజు నేపాల్ రాజధాని ఖాట్మండు మేయర్ బాలెన్ షా.. ఆదిపురుష్ సినిమాలో సీతామాతను భారతదేశానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. సీతామాత భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అది మార్చడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నాం. ఈ లోపు మార్చకపోతే సినిమాను ఖాట్మండులో బ్యాన్ చేస్తాం అని ప్రకటించారు. అయితే దీనిపై చిత్రయూనిట్ స్పందించకపోవడంతో ఆదిపురుష్ చిత్రం పై మరోసారి స్పందిస్తూ.. చిత్రయూనిట్ కి మేము చెప్పినా వాళ్ళు మార్చలేదు, ఎలాంటి స్పందన లేదు. నేపాల్ దేశ ఆత్మగౌరవం కాపాడటం మా బాధ్యత. మా ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆదిపురుష్ సినిమాను ఖాట్మండులో బ్యాన్ చేస్తున్నాం. అందులో ఆ సీన్స్ ని మార్చేంతవరకు ఆదిపురుష్ ఒక్కటే కాదు, ఇండియన్ సినిమాలన్నీ బ్యాన్ చేస్తున్నాం. నేపాల్ రాజ్యాంగంలోని పలు సెక్షన్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు.

ఖాట్మండు తర్వాత మరో రెండు నగరాలు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. త్వరలో నేపాల్ అంతా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేపాల్ లో ఇండియన్ సినిమాలు చాలానే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయంతో ఇండియన్ సినిమాలకు పెద్ద దెబ్బె పడనుంది. ఆదిపురుష్ చేసిన పనికి ఇప్పుడు నేపాల్ లో ఇండియన్ సినిమాలన్నీ బ్యాన్ చేయడంతో మరోసారి ఈ విషయంలో కూడా చిత్రయూనిట్ ని విమర్శిస్తున్నారు.

 

Also Read :  Adipurush : వెనక్కు తగ్గిన ఆదిపురుష్ చిత్రయూనిట్.. డైలాగ్స్ మారుస్తాం అంటూ ప్రకటన..