Site icon HashtagU Telugu

Adipurush on OTT: ఓటిటిలో ప్రత్యేక్షమై షాక్ ఇచ్చిన ఆదిపురుష్

Adipurush Is Now Streaming On This Ott Platform

Adipurush Is Now Streaming On This Ott Platform

ఆదిపురుష్ (Adipurush) మూవీ చడీ చప్పుడు లేకుండా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజుల్లో చిన్న సినిమాకు సైతం పెద్ద ప్రచారం చేసి ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఎలాంటి హడావిడి , ప్రచారం లేకుండానే ఓటిటి లోకి వచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ (Prabhas)..ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. సాహో , రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ ఇప్పటీకే విడుదల కాగా..సలార్ , ప్రాజెక్ట్ కె తదితర సినిమాలు సైతం పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) విషయానికి వస్తే.. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రంగా ఆదిపురుష్ తెరకెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణగాథగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ విమర్శల పాలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా భారీ నష్టాలు మిగిల్చింది. ఆధునిక రామాయణం పేరుతో ఇష్టం వచ్చినట్లు పాత్రల రూపాలు, సన్నివేశాలు తీస్తావా అంటూ డైరెక్టర్ ఫై హిందూ ధర్మాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా ప్రభాస్ కెరియర్ లో మరో భారీ ప్లాప్ జాబితాలో ఆదిపురుష్ చేరింది.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. ఇంత పెద్ద చిత్రాన్ని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమా ద్వారా మేకర్స్ భారీగా నష్టపోయారు. మళ్లీ ప్రమోషన్లు చూసి ఇంకాస్త నష్టపోవడం కంటే డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేస్తే బెటర్ అని డిసైడ్ అయ్యి ..ఈరోజు ఓటిటి లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించగా, కృతి సనన్ జానకి పాత్ర చేసింది. ప్రధాన విలన్ లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలైంది.

Read Also : Iswarya Menon : హాట్ అందాలతో మతి పోగొడుతున్న ఐశ్వ‌ర్య మీన‌న్‌