Site icon HashtagU Telugu

Adipurush Advance Booking: ఆదిపురుష్ మైలేజ్ పెంచిన తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్

Adipurush

Adipurush

Adipurush Advance Booking: రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఆదివారం నుంచి ‘ఆదిపురుష’ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. జూన్ 11 సాయంత్రం 6 గంటల నాటికి PVR, ఐనాక్స్ మరియు సినీపోలిస్‌లలో దాదాపు 18,000 టిక్కెట్లను విక్రయించారు. దాదాపు 23,000 నుండి 25,000 టిక్కెట్లు అమ్ముడవడంతో ఆదిపురుష కౌంటర్లు రాత్రికి మూతపడ్డాయి. PVR మరియు INOX 8800 మరియు 6100 టిక్కెట్లు విక్రయించగా, సినీపోలిస్ 3500 టిక్కెట్లను విక్రయించింది. ఇదంతా 6 గంటల వ్యవధిలో జరగడంతో ఆదిపురుష్ ఓపెనింగ్స్ పై చిత్ర యూనిట్ భారీ ఆశలు పెట్టుకుంది .

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహించారు. బాహుబలి లాంటి బలమైన పాత్రతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆదిపురుష్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 16న పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది.

Read More: Adipurush Offer: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!