Site icon HashtagU Telugu

Prasanth Varma : ఆ సూపర్ హీరో సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం లేదట.. మరో దర్శకుడితో..

Adhira, Prasanth Varma, Jai Hanuman

Adhira, Prasanth Varma, Jai Hanuman

Prasanth Varma : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘అ!’ అనే ఒక డిఫరెంట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలతో వరుస హిట్స్ ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఇక హనుమాన్ సినిమాతో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసారు.

ఇక ఈ దర్శకుడు లైనప్ లో రాబోతున్న సూపర్ హీరో సినిమాల పై ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీ చూపిస్తున్నారు. హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ నుంచి రావాల్సిన మరో సూపర్ హీరో చిత్రం ‘అధీర’. టాలీవుడ్ బడా నిర్మాత డివివి దానయ్య కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ.. ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 2022 లోనే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేస్తూ, ఒక చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. దేవుళ్ళ రాజు ఇంద్రుడి వజ్రాయుధం శక్తులతో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని ఆ టీజర్ తో తెలియజేసారు.

దీంతో ఆ మూవీ పై కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే హనుమాన్ సినిమా హిట్ తరువాత ప్రశాంత్ వర్మ ఆ సినిమాని పక్కన పెట్టేసారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా ఆఫర్లు వస్తుండడంతో.. ప్రశాంత్ వర్మ అటువైపుగా ఫోకస్ పెట్టారు. దీంతో ‘అధీర’ సినిమా పరిస్థితి ఏంటో తెలియడం లేదు. అయితే ఫిలిం వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. అధీర సినిమా భాద్యతలను వేరే దర్శకుడు తీసుకుంటున్నాడట. నాగార్జున సినిమా ‘నా సామి రంగ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బిన్నీ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో అధీర మూవీని డైరెక్ట్ చేయబోతున్నారట. మరి దర్శకుడు బిన్నీ అధీరని ఎలా చూపించబోతున్నారో చూడాలి.