Adar Poonawalla : ‘కొవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ పేరు తెలుసు కదా ? దీన్ని చాలా మంది వేయించుకున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో రకాల వ్యాక్సిన్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ యజమాని అదర్ పూనావాలా చూపు సినిమా రంగం వైపు మళ్లింది. కరణ్ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను దాదాపు రూ.1000 కోట్లతో అదర్ పూనావాలా కొనేయనున్నారు.
Also Read :Australia Vs King : బ్రిటన్ రాజుకు షాక్.. ఆదివాసీ సెనెటర్ ఏం చేసిందంటే..
సెరెనె ప్రొడక్షన్స్ అనే ప్రత్యేక కంపెనీని అదర్ పూనావాలా ఏర్పాటు చేశారు. తాజా డీల్ ద్వారా ధర్మా ప్రొడక్షన్స్‌లోని 50 శాతం వాటా సెరెనె ప్రొడక్షన్స్‌కు సొంతం కానుంది. మిగతా 50 శాతం వాటా కరణ్ జోహర్ చేతిలోనే ఉంటుంది. ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలోనే కరణ్ (Adar Poonawalla) కంటిన్యూ అవుతారు. సీఈవోగా అపుర్వా మెహతానే కొనసాగుతారు. ఈవిషయంపై ఇరు కంపెనీలు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.
Also Read :Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
ఈ డీల్‌పై పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు కరణ్‌తో చేతులు కలిపి వ్యాపార భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ధర్మా ప్రొడక్షన్స్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. దీనిపై కరణ్ స్పందిస్తూ.. భావోద్వేగ కథన శక్తి, భవిష్యత్తు వ్యాపార వ్యూహాల సమ్మేళనమే తమ భాగస్వామ్యం అని చెప్పారు. ప్రజలపై ముద్ర వేసే సినిమాలను నిర్మించాలని తన తండ్రి ఆకాంక్షించే వారని గుర్తు చేసుకున్నారు. సృజనాత్మకత కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ధర్మా ప్రొడక్షన్స్‌ను మార్చేందుకు ఈ బంధం దోహదపడుతుందని కంపెనీ సీఈవో మెహతా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ భాగస్వామ్యం ప్రభావం బాలీవుడ్‌లో కచ్చితంగా ఉండనుంది.