Mumbai: బాలీవుడ్ నటి అదా శర్మ ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటుంది. అయితే ఆమె ముంబైలోని మౌంట్ బ్లాంక్ ఫ్లాట్ కొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అదేంటి ఒక ఇంటికి కొనుగులు చేస్తే కూడా చర్చ అవసరమా అనుకుంటున్నారా?. ఆమె కొనాలనుకుంటున్న మౌంట్ బ్లాంక్ ఫ్లాట్ మరెవరిదో కాదు.ఎమ్ఎస్ ధోని లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో విశేషంగా ఆకట్టుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఆదా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. 2020లో సుశాంత్ అకాల మరణం అనంతరం ఆమె మౌంట్ బ్లాంక్ ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు సుశాంత్ నివసించిన ఫ్లాట్ ఇప్పుడు ఆదా స్వాధీనం చేసుకోవడంతో చర్చకు దారి తీసింది. ఆమె చివరిసారిగా ది కేరళ స్టోరీలో కనిపించింది.ఈ సినిమా వివాదాస్పదమైనప్పటికీ సినిమా మంచి విజయం సాధించింది.
Also Read: Hyderabad: కొడుకుకి కిడ్నీ దానం చేసి మరోసారి ప్రాణం పోసిన తల్లి