Square Movie: టిల్లు స్క్వేర్ నుంచి థమన్ తప్పుకోవడానికి కారణం అదేనా?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 19 Mar 2024 09 37 Am 1677

Mixcollage 19 Mar 2024 09 37 Am 1677

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

విడుదల తేదీకి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రమోషన్స్ ను చేస్తూనే మరొకవైపు సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఎక్సైట్మెంట్ ను మరింత పెంచుతున్నారు. కాగా అందులో బాగంగానే తాజాగా హో మై లిల్లీ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. అయితే మొదట ఈ చిత్రానికి థమన్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కోరారు. ఆయన కూడా ఒప్పుకున్నారు.

కానీ తర్వాత థమన్ కు బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకు వర్క్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నాము అని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సినిమాను సమయానికి ప్రేక్షకులకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మొత్తానికి తమన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న కారణం చెబుతూ రూమర్స్ కి చెక్ పెట్టారు నిర్మాత. కాగా తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ దర్శకులలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. చేతి నిండా ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు తమన్.

  Last Updated: 19 Mar 2024, 09:38 AM IST