Site icon HashtagU Telugu

Actress Tamannaah : హీరోయిన్ తమన్నాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

Tamannah

Tamannah

Actress Tamannaah : వయాకమ్‌ కంపెనీ ఫిర్యాదు  మేరకు ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో తమన్నా(Actress Tamannaah) లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం వల్ల తమకు కోట్లలో నష్టం వాటిల్లిందని వయాకమ్‌ కంపెనీ ఆరోపించింది. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల ప్రసార హక్కులను అధికారికంగా తామే దక్కించుకున్నామని వయాకమ్‌ గుర్తుచేసింది. తమన్నా భాటియా ఫెయిర్‌ప్లే యాప్‌ను ప్రమోట్ చేశారని, అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఇదే కేసులో  యాక్టర్ సంజయ్‌ దత్‌కు  కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించినప్పటికీ.. గైర్హాజరయ్యారు. ఆ విచారణ జరిగిన రోజున తాను దేశంలో లేనని సంజయ్ దత్ తెలిపారు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని పోలీసులను ఆయన కోరారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :WhatsApp Offline File Sharing : ఇంటర్నెట్ లేకున్నా ఫైల్స్​​ షేరింగ్.. వాట్సాప్‌ కొత్త ఫీచర్​​