Tamannaah: ఇది కదా తమన్నా అంటే.. రిజెక్ట్ చేసిన వాళ్ళతోనే కలిసినటిస్తోందిగా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. తెలుగు తమిళం హిందీ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Mar 2024 03 39 Pm 4739

Mixcollage 20 Mar 2024 03 39 Pm 4739

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. తెలుగు తమిళం హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లు, పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. కాగా వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. తమన్నా చిన్నతనంలో డ్యాన్స్ రియాలిటీ షో బూగీ వూగీ కోసం ఆడిషన్ చేసిందట. కానీ రిజక్ట్ అయ్యిందట. ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. నేను బూగీ వూగీ రియాలిటీ షో నుంచి నేను రిజక్ట్ అయ్యాను. ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నాను అని తెలిపింది తమన్నా.

కాగా ఈ మాటలు విన్న జావేద్ జాఫ్రీ షాక్ అయ్యాడు. తమ రియాలిటీ షో కోసం తమన్నా కూడా ఆడిషన్‌కి వెళ్లిందని అతనికి తెలియదు. ఇక తమన్నా వెబ్ సిరీస్ డేరింగ్ పార్టనర్స్ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. ప్రపంచాన్ని పట్టించుకోకుండా మద్యం కంపెనీని ప్రారంభించేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అదే సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సిరీస్ చూపించారు. కరణ్ జోహార్ ధర్మా ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించిన ఈ సిరీస్‌కి అర్చిత్ కుమార్, నిశాంత్ నాయక్ దర్శకత్వం వహించనున్నారు.

  Last Updated: 20 Mar 2024, 03:39 PM IST