Site icon HashtagU Telugu

Surekhavani: సినిమాలు లేకపోయినా సురేఖవాణి లగ్జరీగా గడపడానికి కారణం అదే.. వాళ్ళతో ఎఫైర్స్!

Mixcollage 13 Mar 2024 10 04 Am 12

Mixcollage 13 Mar 2024 10 04 Am 12

తెలుగు సినీ ప్రేక్షకులకు నటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి. నటిగా లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖ. సహాయ నటిగా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ తో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి చేసే రచ్చ గురించి మనందరికీ తెలిసిందే. తన కూతురు సుప్రీతతో కలిసి ఈ వయసులో కూడా అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. అయితే కెరిర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో భర్త మరణంతో సురేఖ వాణి కొన్నాళ్ళు నటనకు దూరమైంది. తర్వాత లాక్ డౌన్ వచ్చింది. లాంగ్ గ్యాప్ రావడంతో సురేఖావాణిని దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు మర్చిపోయారు. నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదంటూ ఆ మధ్య ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో సురేఖ వాణి ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్న సురేఖావాణి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. అభిమానులకు ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంది. సదరు ఫోటోల్లో సురేఖ వాణి విలాసాలు చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బడా బాబులతో అఫైర్స్ పెట్టుకున్న సురేఖ వాణి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. చేతిలో సినిమాలు కూడా లేవు, ఆమెకు డబ్బులు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన సురేఖావాణి.. నేను తెలుగులో సినిమాలు చేయకపోయినా, తమిళంలో చేస్తున్నాను. ఆ విధంగా సర్వైవ్ అవుతున్నాను. నా ముఖం, డ్రెస్సింగ్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది. అందుకే అలాంటి భావన కలుగుతుందని సురేఖ వాణి అన్నారు.