Site icon HashtagU Telugu

Surabhi: చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన హీరోయిన్.. జస్ట్ మిస్ చనిపోయేదాన్నంటూ!

Mixcollage 19 Mar 2024 12 35 Pm 771

Mixcollage 19 Mar 2024 12 35 Pm 771

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బీరువా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నటించి భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఈమెకు ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమా అవకాశాలు వచ్చాయి.. అయితే సురభి తెలుగులో నటించినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలిచాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ప్రస్తుతం తమిళంలో అడపా దడపాసినిమాలలో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌‍స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ మేరకు ఆ పోస్టులో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను అనిపించింది. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు.

కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాంతో మేమంతా బతికాం. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా అంది. జస్ట్ మిస్ చావు నుంచు తప్పించుకొని వచ్చాను. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది అని రాసుకొచ్చింది సురభి. దీంతో సురభి పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో సురభికి ఏమి కాలేదని తెలుస్తుంది. అయితే సురభి ఎక్కడికి వెళ్తుంది, ఏ ఫ్లైట్ లో, ఎక్కడ ఈ ఘటన జరిగింది అనేది మాత్రం ప్రకటించలేదు. ఈ వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు థాంక్ గాడ్ మీకు ఏమీ అవ్వలేదు అది చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version