Site icon HashtagU Telugu

Sriya Reddy : ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడను.. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. నటి శ్రియారెడ్డి కామెంట్స్…

Actress Sriya Reddy comments on Pawan Kalyan and AP Politics

Actress Sriya Reddy comments on Pawan Kalyan and AP Politics

తమిళ నటి శ్రియారెడ్డి(Sriya Reddy) పొగరు(Pogaru) సినిమాలో విలన్ గా నటించి తమిళ్, తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. శ్రియారెడ్డి హీరో విశాల్(Vishal) కి వదిన కూడా అవుతుంది. గతంలో తమిళ్ లో పలు సినిమాలు చేసిన శ్రియారెడ్డి కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటీవల వరుస సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం శ్రియారెడ్డి తెలుగులో ప్రభాస్ సలార్, పవన్ కళ్యాణ్ OG సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. ఇప్పటికే సలార్ లో తన షూటింగ్ పూర్తవ్వగా, OG లో ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి మాట్లాడింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడింది.

శ్రియారెడ్డి మాట్లాడుతూ.. నేను ఏపీ పాలిటిక్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను. కానీ వాటి గురించి మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు సెట్ లో చాలా సైలెంట్ గా ఉంటారు. కానీ పాలిటిక్స్ లో స్పీచ్ లు మాత్రం అదిరిపోతాయి. ఆయన స్పీచ్ లు బాగుంటాయి. చాలా పవర్ ఫుల్ గా మాట్లాడతారు. అయన సీఎం అవుతారా, అవ్వరా అని నేను చెప్పను కానీ సీఎం అయితే మాత్రం ప్రజలకు బాగా కనెక్ట్ అవుతారు. ఆయనది చాలా మంచి మనసు, అందరితో చాలా మంచిగా, గౌరవంగా ఉంటారు అని తెలిపింది. దీంతో శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Minister Roja : చరణ్‌కి కూతురు పుట్టినందుకు రోజా స్పెషల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను అంటూ..