Site icon HashtagU Telugu

Shraddha Das: జబర్దస్త్ జడ్జిగా బోల్డ్ బ్యూటీ.. ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ పక్కా!

Shraddadas

Shraddadas

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనగానే.. కడుపుబ్బా నవ్వించే కామెడీ, కంటస్టెంట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్.. జడ్టీల పంచ్ లు గుర్తుకువస్తాయి. బుల్లితెరపై ఏ షోకు లేని పాపులర్ దీనికి ఉంది. అలాంటి షోను ప్రస్తుత ఏపీ మంత్రి రోజా రక్తి కట్టించారు. ఏళ్ల తరబడి జడ్జిగా అలరించి షోను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. అయితే రోజా గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ ప్రోగ్రామ్ పడుతూ లేస్తోంది. ఇక రేటింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. రోజా ప్లేస్ లో ఆమని, ఇంద్రజ లాంటి ఎంట్రీ ఇచ్చినా రోజా స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో జబర్ధస్త్ నిర్వాహకులు ఓ హాట్ జడ్జి కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శ్రద్ధా దాస్ ఈ జడ్జిగా ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో బోల్డ్ గా కనిపించే ఈ బ్యూటీ ఇక జబర్దస్త్ కు ఎంట్రీ ఇస్తే.. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు గ్లామర్ ట్రీట్ కూడా పక్కా.